: కోల్ కతా రైల్వే స్టేషన్ సమీపంలో నాటుబాంబు పేలుడు...ఇద్దరికి గాయాలు
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాలో నాటుబాంబు పేలుడు కలకలం రేపింది. కోల్ కతాలోని డమ్ డమ్ రైల్వే స్టేషన్ వద్ద నాటు బాంబు పేలింది. ఈ పేలుడులో ఇద్దరు చిన్నారులకు గాయాలయ్యాయి. పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో పోలీసులు మరో మూడు నాటుబాంబులు స్వాధీనం చేసుకున్నారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.