: వారిని తీసుకెళ్లిపోండి...లేదా వారు నివసించే భూమిని ఇవ్వండి: సుబ్రమణ్యస్వామి


పశ్చిమ బెంగాల్ లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి పేర్కొన్నారు. కోల్ కతాలో జరిగిన మర్చంట్స్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సదస్సులో ఆయన మాట్లాడుతూ, కమ్యూనిస్టు ప్రభుత్వంపై ఆడపులిలా పోరాడిన మమతా బెనర్జీ వారిని గద్దె దింపారు. కానీ పలు వైఫల్యాల కారణంగా ఇప్పుడా ఆడపులి బోనులోకి వెళ్లాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. శారదా స్కాంలోనే కాకుండా భారతదేశానికి శాంతి భద్రతల సమస్య రేపుతున్న బంగ్లా చొరబాటుదారులను అడ్డుకోవడంలో మమతా ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆయన ఆరోపించారు. అక్రమ చొరబాటుదారుల కారణంగా శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. బంగ్లాదేశ్ లోని మూడింట ఒక వంతు ప్రజలు భారత్ లోనే నివాసం ఉంటున్నారని ఆయన తెలిపారు. వీరందర్నీ బంగ్లాదేశ్ తీసుకెళ్లాలని, లేని పక్షంలో వీరు నివసించేందుకు అవసరమైన భూభాగంపై నియంత్రణ భారత్ కు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News