: ఏపీలో వృద్ధ కళాకారుల పింఛను పెంపు
ఆంధ్రప్రదేశ్ వృద్ధ కళాకారులకు కొత్త సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. వారి పింఛను రూ.500 నుంచి రూ.1500కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ నిర్ణయాన్ని ఉత్తర్వుల రూపంలో ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు జారీ చేశారు. పెంచిన పింఛను ఈ నెల నుంచే అమల్లోకి రానుంది. ఈ పెంపుతో ఏపీ ప్రభుత్వంపై అదనపు భారం పడనుంది. టీడీపీ అధికారంలోకి వచ్చాక వితంతు, వికలాంగుల పింఛన్లను కూడా రెట్టింపు చేసిన సంగతి తెలిసిందే.