: తిరుమల చేరుకున్న యూపీ సీఎం అఖిలేశ్
ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేశ్ యాదవ్ తిరుమల చేరుకున్నారు. శ్రీవారి దర్శనం కోసం తిరుమల వచ్చిన ఆయనకు జేఈవో శ్రీనివాస రాజు తగు మర్యాదలతో స్వాగతం పలికారు. ఆదివారం ఉదయం ఆయన స్వామివారిని దర్శించుకుంటారు. ఈ సందర్భంగా అఖిలేశ్ మాట్లాడుతూ, తిరుమల అంటే తనకెంతో ఇష్టమని తెలిపారు. వెంకటేశ్వరుడు తన ఇష్టదైవమని చెప్పారు.