: కేసీఆర్ గాలి వాగ్దానాలతో తెలంగాణకు నష్టం: నాగం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ నేత నాగం జనార్థనరెడ్డి మండిపడ్డారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ అనాలోచిత నిర్ణయాల కారణంగా తెలంగాణ రాష్ట్రానికి నష్టం వాటిల్లుతోందని అన్నారు. కేసీఆర్ రాష్ట్ర పాలనను గాలికొదిలేసి, పర్యటనల పేరిట గాలి వాగ్దానాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ నెల 17 లోపు కల్వకుర్తి ప్రాజెక్టును చేపట్టకపోతే నిరసనదీక్ష చేస్తానని నాగం హెచ్చరించారు. కేసీఆర్ ప్రభుత్వానికి ప్రజల ఉసురు తగులుతుందని ఆయన విమర్శించారు.