: డ్రైవర్ రహిత కారు... నాసా, నిస్సాన్ సంయుక్త పరిశోధన
కార్ల తయారీ రంగంలో ఓ కొత్త ఆవిష్కరణకు తెరలేవబోతోంది. డ్రైవర్ లేకుండా, స్వీయ సాంకేతికతో నడిచే కారును రూపొందించేందుకు 'నాసా', జపనీస్ వాహనతయారి సంస్థ 'నిస్సాన్' జట్టు కడుతున్నాయి. కాలిఫోర్నియాలోని మోఫెట్ లో యోకొహోమాకు చెందిన నిస్సాన్ మోటార్ కంపెనీ, నాసాకు చెందిన ఏమ్స్ రిసెర్చ్ సెంటర్ సంయుక్తంగా ఈ పరిశోధన జరపనున్నాయి. ఐదేళ్ల పాటు జరగనున్న ఈ పరిశోధనలో అటానమస్ వెహికల్ సిస్టమ్ అభివృద్ధి చేస్తారు. భవిష్యత్తులో ఈ వ్యవస్థను వాణిజ్యపరంగా విక్రయించే కార్లలోనూ వారు ఉపయోగిస్తారు.