: 'గోపాల గోపాల' ప్రదర్శిస్తున్న థియేటర్ పై దాడి


ఈ రోజు విడుదలైన 'గోపాల గోపాల' చిత్రంపై నిరసనలు వ్యక్త మవుతున్నాయి. నల్గొండజిల్లా చౌటుప్పల్ లో ఈ సినిమాను ప్రదర్శిస్తున్న థియేటర్ పై కొంతమంది దాడి చేశారు. ఈ ఘటనలో థియేటర్ ఫర్నీచర్, అద్దాలను ధ్వంసం చేశారు. దాంతో సినిమా ప్రదర్శనను మధ్యలోనే నిలిపివేశారు. నటుడు పవన్ కల్యాణ్ అతిథి పాత్రలో చేసిన ఈ చిత్రంలో వెంకటేశ్ హీరోగా చేశారు. కాగా ఈ ఉదయం సైఫాబాద్ పోలీస్ స్టేషన్ లో 'గోపాల గోపాల'పై రఘునాథరావు అనే వ్యక్తి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. హిందువుల మనోభావాలు దెబ్బతీసేవిధంగా ఉందని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News