: తప్పించుకున్న మహిళా ఉగ్రవాది ప్రమాదకరమంటున్న ఫ్రెంచి పోలీసులు


ఫ్రాన్స్ రాజధాని పారిస్ నగరం మీద విరుచుకుపడిన ఉగ్రవాదుల్లో అత్యంత ప్రమాదకారియైన మహిళా ఉగ్రవాది తప్పించుకోవడంతో అక్కడి పోలీసులకు నిద్రకరవైంది. ఆమె గురించిన పలు వివరాలు వారిని ఆందోళనకు గురిచేస్తున్నాయి. మహిళా ఉగ్రవాది పేరు హయత్ బౌముదీన్ కాగా, ఆమె యెమెన్ లో అల్ ఖైదా శిబిరాల్లో శిక్షణ తీసుకున్నట్టు తెలుస్తోంది. కాగా, పారిస్ లో జరిగిన మూడు దాడుల్లో పాలుపంచుకున్న ఉగ్రవాదులు ఒకరికి ఒకరు తెలిసినవాళ్లేనని అధికారులు చెబుతున్నారు. హయత్ 'డబుల్ ట్యాప్'(సెమీ ఆటోమేటిక్ తుపాకీతో వెంటవెంటనే రెండు బుల్లెట్లను ఒకే లక్ష్యంపైకి కాల్చడం) టెక్నిక్ లో నిష్ణాతురాలని పోలీసులు పేర్కొంటున్నారు. అత్యాధునిక ఆయుధాలు ఉపయోగించడంలో ఆమె దిట్ట అని చెబుతున్నారు. దీంతో, సహ ఉగ్రవాదుల ప్రాణత్యాగానికి ఆమె ఏ రకమైన ప్రతీకారం తీర్చుకుంటుందోనని ఫ్రాన్స్ భీతిల్లుతోంది. కాగా, ఫ్రాన్స్ లో ఆమె ఫోటోను విడుదల చేశారు. ఆమెతో జాగ్రత్తగా ఉండాలని, ఆమె కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. బౌముదీన్ సాయుధురాలైన అత్యంత ప్రమాదకరమైన వ్యక్తని పోలీసులు హెచ్చరించారు.

  • Loading...

More Telugu News