: రేపు గుజరాత్ కు బాన్ కీ మూన్
ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ రేపు గుజరాత్ రానున్నారు. నర్మదా నది కాలువపై నిర్మించ తలబెట్టిన 10 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ నిర్మాణాన్ని ప్రారంభించనున్నారని ఆ రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి సౌరభ్ పటేల్ తెలిపారు. 10 నెలల క్రితమే ఈ సౌర విద్యుత్ ప్లాంట్ కోసం ప్రణాళిక రూపొందించామన్నారు. రూ.109.91 కోట్లతో ప్లాంట్ నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు. ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సర్దార్ సరోవర్ ప్రాజెక్టును నిర్మించేందుకు ప్రభుత్వం 'ద సర్దార్ సరోవర్ నర్మదా నిగమ్ లిమిటెడ్'ను ఏర్పాటుచేసినట్లు తెలిపారు.