: ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్ గా కివీస్ స్టార్
ఐపీఎల్ డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ జట్టుకు కొత్త బౌలింగ్ కోచ్ గా షేన్ బాండ్ నియమితుడయ్యాడు. న్యూజిలాండ్ క్రికెట్లో ఒకప్పుడు స్టార్ బౌలర్ గా వెలుగొందిన షేన్ బాండ్ త్వరలో జరగనున్న ఐపీఎల్ టోర్నీలో ముంబై జట్టుకు బౌలింగ్ కోచ్ గా సేవలందిస్తాడు. ఈ మేరకు బాండ్ తో ముంబై జట్టు ఒప్పందం కుదుర్చుకుంది. ముంబై ఇండియన్స్ జట్టుకు చీఫ్ కోచ్ గా పాంటింగ్, ఫీల్డింగ్ కోచ్ గా జాంటీ రోడ్స్, బ్యాటింగ్ కోచ్ గా రాబిన్ సింగ్ సేవలందిస్తున్న సంగతి తెలిసిందే. తన నియామకంపై షేన్ బాండ్ మాట్లాడుతూ, ఐపీఎల్ లో ముంబైకి పనిచేయడం ఎంతో బాధ్యతతో కూడుకున్నదని అన్నాడు.