: టీమిండియాకు కొత్త కోచ్ వేటలో బీసీసీఐ!


టీమిండియా ప్రస్తుత కోచ్ డంకన్ ఫ్లెచర్ కాంట్రాక్టు వరల్డ్ కప్ తో ముగియనుంది. ఆయనకు మరోసారి కోచింగ్ బాధ్యతలు అప్పగించేందుకు బీసీసీఐ సిద్ధంగా లేదు. విదేశాల్లో టెస్టు సిరీస్ లు కోల్పోవడంతో ఫ్లెచర్ వ్యూహాలపై పెద్ద ఎత్తున విమర్శలు రావడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, జట్టు అవసరాలకు తగిన కోచ్ కోసం బీసీసీఐ చూస్తోంది. ఇప్పటికే కొత్త కోచ్ కోసం అన్వేషణ మొదలైనట్టు తెలుస్తోంది. కాగా, తన భార్యకు అనారోగ్యంగా ఉందని, కోచింగ్ బాధ్యతల నుంచి ముందే వైదొలగుతానని ఫ్లెచర్ చెప్పగా, వరల్డ్ కప్ వరకు కొనసాగాలని బోర్డు సూచించినట్టు సమాచారం. కోచ్ గా వ్యవహరించేందుకు ఆసక్తి కనబరుస్తున్న పలువురితో సంప్రదింపులు జరుపుతున్నామని, టీమిండియాలోని సీనియర్ ఆటగాళ్ల అభిప్రాయాలు కూడా తీసుకుంటున్నామని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. టీమిండియా కోచ్ గా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైకేల్ హసీ అయితే అతికినట్టు సరిపోతాడని ఎంఎస్ ధోనీ బీసీసీఐకి ప్రతిపాదించినట్టు వార్తలు రావడం తెలిసిందే.

  • Loading...

More Telugu News