: ఢిల్లీ ప్రచారంలో కేజ్రీవాల్ పై మోదీ విమర్శలు


ఢిల్లీలో తొలి రోజు ఎన్నికల ప్రచారంలో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ధ్వజమెత్తారు. వీధుల్లో కూర్చొని ధర్నాలు చేయడంలో ప్రత్యేక నైపుణ్యం కలిగిన వారికి అదే పని అప్పగించాలని మోదీ ఎద్దేవా చేశారు. తాము మంచి ప్రభుత్వాన్ని నడపగలమని, కాబట్టి తమనే ఎన్నుకోవాలని చెప్పారు. పూర్తి మెజారిటీతో ఉన్న ప్రభుత్వాన్నే ఎన్నుకోవాలని కోరారు. 'ఆప్' సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామాతో ఢిల్లీలో ఓ సంవత్సరం వృథాగా పోయిందన్న ప్రధాని, బీజేపీకి ఓటు వేసి వారిని శిక్షించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. తాను అరాచకవాదినని (గతేడాది జనవరిలో ఢిల్లీలో చేసిన ధర్నాలో తాను అరాచకవాదినని కేజ్రీ స్వయంగా ప్రకటించుకున్నారు) చెప్పుకున్న నేతలకు జాతీయ రాజధానిలో ఉండే చోటు లేదని, అడవులకు వెళ్లి మావోయిస్టులతో కలవాలని మోదీ సూచించారు.

  • Loading...

More Telugu News