: టెస్టు సిరీస్ ఓటమిపై నిరాశ చెందడంలేదు: కోహ్లీ
సిడ్నీ టెస్టు డ్రాగా ముగిసిన అనంతరం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మీడియా సమావేశంలో మాట్లాడాడు. టెస్టు సిరీస్ ఫలితంపై నిరాశ చెందడంలేదని అన్నాడు. సిరీస్ మొత్తం జట్టు ఆసీస్ కు గట్టి పోటీ ఇచ్చిందని తెలిపాడు. నాలుగు టెస్టుల సిరీస్ లో రెండు టెస్టులు ఓడి, మరో రెండింటిని డ్రా చేసుకోవడం పట్ల ఈ ఢిల్లీ స్టార్ సంతృప్తి వ్యక్తం చేశాడు. సిడ్నీ టెస్టు చివరి రోజు ఆటలో తమకు గెలిచే అవకాశం వచ్చిందని, అయితే, ఆస్ట్రేలియా పుంజుకుందని తెలిపాడు. మొత్తమ్మీద ఇదో అద్భుతమైన సిరీస్ అని అభివర్ణించాడు. కుర్రాళ్లు అంతర్జాతీయస్థాయికి తగ్గ ప్రదర్శన చేశారని ప్రశంసించాడు. సిరీస్ లో కొన్ని సానుకూలాంశాలున్నా... బ్యాటింగ్, బౌలింగ్ రంగాల్లో మరింత నిలకడ కనబర్చాల్సిన అవసరం ఉందని కోహ్లీ అభిప్రాయపడ్డాడు.