: పార్టీలన్నీ ఒప్పుకుంటే మత మార్పిళ్ల వ్యతిరేక చట్టం సాధ్యం: నఖ్వీ


అన్ని పార్టీలు తమ ఆమోదం తెలిపితే జాతీయస్థాయిలో మత మార్పిళ్ల వ్యతిరేక చట్టాన్ని తీసుకురావడం సాధ్యమవుతుందని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ అన్నారు. హైదరాబాదులో జరిగిన మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్శిటీ 17వ వ్యవస్థాపక దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, "అన్ని పార్టీలు కూడా సంసిద్ధత తెలిపితే మత వ్యతిరేక మార్పిళ్ల చట్టం ఆమోదం పొందుతుంది. చాలా రాష్ట్రాల్లో ఈ చట్టం ఉంది. మత మార్పిడి అనేది కొత్త సమస్య కాదు. చాలా పాతది. బలవంత మార్పిడిపై చట్టం తీసుకురావడంలో సమస్యేమీ లేదు. కానీ రాజకీయ పార్టీలు, ప్రజలు దీనికి తప్పకుండా అంగీకారం తెలపాలి" అని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News