: మాజీ ఎమ్మెల్యే వత్తాసుతో ఆస్తి కోసం ఒత్తిడి చేస్తున్నారు: మీడియాతో చక్రి సతీమణి
టాలీవుడ్ సంగీత దర్శకుడు చక్రి సతీమణి శ్రావణి, తనపై పెరుగుతున్న వేధింపులకు సంబంధించి కొద్దిసేపటి క్రితం కీలక వ్యాఖ్యలు చేశారు. తన భర్త సంపాదించిన ఆస్తిని కాజేసేందుకు తన అత్త, ఆమె తరఫు బంధువులు యత్నిస్తున్నారని ఆరోపించారు. వారికి మాజీ ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ వత్తాసు పలుకుతున్నారని తెలిపారు. తన భర్త డెత్ సర్టిఫికెట్ కూడా తనకు అందకుండా లక్ష్మీనారాయణ అడ్డుకున్నారని ఆరోపించారు. ఈ విషయంలో లక్ష్మీనారాయణ నేరుగా ఏసీపీకే ఫోన్ చేశారని తెలిపారు. ఓ ప్రైవేట్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ పేరు వెల్లడించిన ఆమె, ఆయన ఏ ప్రాంతానికి చెందినవారన్న విషయాన్ని మాత్రం పేర్కొనలేదు.