: దమ్ముంటే ఢిల్లీకి రాష్ట్ర హోదా కల్పించండి: ప్రధాని మోదీకి కేజ్రీవాల్ సవాల్
ఢిల్లీలో ఎన్నికల వేడి రాజుకుంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకుండానే ఆయా పార్టీలు సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ తాజా మాజీ ముఖ్యమంత్రి ఈ సవాళ్లకు తెర తీశారు. దమ్ముంటే ఢిల్లీకి రాష్ట్ర హోదా కల్పించాలంటూ ఆయన ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే సవాల్ విసిరారు. గడచిన ఎన్నికల్లో ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా కల్పిస్తామని బీజేపీ ప్రకటించిందని, ఆ హామీని నిలబెట్టుకోవాలని కేజ్రీవాల్ గళమెత్తారు. నేడు రామ్ లీలా మైదాన్ లో మోదీ భారీ బహిరంగ సభ నేపథ్యంలో కేజ్రీవాల్ ఈ సవాల్ విసిరారు. మరి దీనికి మోదీ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.