: సునందా పుష్కర్ కేసులో పాక్ జర్నలిస్టును ప్రశ్నించే అవకాశం
కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ భార్య సునంద పుష్కర్ హత్య కేసులో ఢిల్లీ పోలీసుల దర్యాప్తు వేగవంతంగా జరుగుతోంది. పాకిస్థాన్ మహిళా జర్నలిస్టు మెహర్ తరార్ ను ఈ కేసులో ప్రశ్నించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మేరకు ప్రశ్నావళి సిద్ధం అవుతోందని, ఈ-మెయిల్ ద్వారా దాన్ని పంపి సమాధానాలు కోరతామని దర్యాప్తుకు సంబంధించిన పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ కేసులో తనను విచారించాలనుకుంటే పూర్తిగా సహకరిస్తానని తరార్ ఇప్పటికే బహిరంగంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. సునంద చనిపోక ముందు కొన్ని రోజుల కిందట థరూర్ కు, తరార్ కు సంబంధాలున్నాయని వార్తలు వచ్చాయి. వాటిపై అప్పట్లో తరార్ ట్విట్టర్ లో స్పందించడంతో చిన్నపాటి కలకలం రేగింది. ఆ తరువాతే అకస్మాత్తుగా సునంద చనిపోవడం తెలిసిందే.