: లండన్ లో అంబేద్కర్ నివసించిన ఇంటిని కొనాలని బీజేపీ విజ్ఞప్తి


లండన్ లో రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నివసించిన ఇంటిని కొనాలని కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీ కోరింది. ఈ మేరకు ముంబయి బీజేపీ అధ్యక్షుడు ఆశిష్ షెలార్ మాట్లాడుతూ, ఇంటి విషయంలో ప్రధానమంత్రి జోక్యం కోరుతూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి లేఖ రాశామన్నారు. అంబేద్కర్ అనుచరులు, మహారాష్ట్ర ప్రజలకు సంబంధించినంతవరకు ఈ అంశం అత్యంత భావోద్వేగ పూరితమైనదని పేర్కొన్నారు. 2,050 చదరపు అడుగుల విస్తీర్ణంలోని ఈ మూడు అంతస్తుల నివాస భవనం మార్కెట్ ధర ప్రకారం రూ.40 కోట్ల ఉంటుందని గతేడాది లండన్ లోని ఓ ఏజెంట్ తెలిపారని, అప్పటికే అమ్మకానికి పెట్టినట్టు కూడా చెప్పారని షెలార్ వివరించారు. అందుకే, ఆ ఇంటిని భారత్ సొంతం చేసుకోవాలని సూచించారు. మరోవైపు, ఆ ఇంటిని కొనాలని మాజీ ముఖ్యమంత్రి పృథ్విరాజ్ చవాన్ కూడా విజ్ఞప్తి చేశారు. తాను సీఎంగా ఉన్నప్పుడు అప్పటి కేంద్ర ప్రభుత్వాన్ని కోరానని, ఆ తరువాత ఏం జరిగిందో తెలియదనీ అన్నారు.

  • Loading...

More Telugu News