: వచ్చే నెలలో పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీ: మంత్రి అయ్యన్నపాత్రుడు


ఏపీలో ఖాళీగా ఉన్న పంచాయతీ కార్యదర్శి పోస్టులను భర్తీ చేయనున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. నేటి ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన ఈ మేరకు ప్రకటించారు. వచ్చే నెలలోనే భర్తీ ప్రక్రియను చేపడతామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2,400 కార్యదర్శి పోస్టులను తక్షణమే భర్తీ చేస్తామని ఆయన వెల్లడించారు. నియామకాల్లో పారదర్శకతకు పెద్ద పీట వేస్తామని ప్రకటించిన ఆయన భర్తీ ప్రక్రియను ఏపీపీఎస్సీ ద్వారా చేపడతామని తెలిపారు.

  • Loading...

More Telugu News