: అనంతపురం జిల్లా పెనుకొండ ఘాట్ రోడ్డు మూసివేత
అనంతపురం జిల్లాలోని పెనుకొండ-మడకశిర ఘాట్ రోడ్డులో మూడు రోజుల కిందట ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనతో పెనుకొండ ఘాట్ రోడ్డును మూసివేస్తున్నట్టు ఈరోజు అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో, మడకశిర వచ్చే వాహనాలను ఎల్ జీబీ నగర్ మీదుగా పెనుకొండకు మళ్లిస్తున్నారు. ఈ ఘటనను సుమోటోగా తీసుకున్న అనంతపురం జిల్లా కోర్టు, ప్రమాదం జరిగిన తరువాత కూడా అదే మార్గంలో వాహనాలను అనుమతించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దాంతో, నేటి నుంచి రహదారి రాకపోకలను నిలిపివేశారు. కొన్ని నెలల కిందట రోడ్డు పక్కగా తీసిన భారీ గోతిలో ఆర్టీసీ బస్సు పడిపోవడంతో 15 మంది చనిపోగా, 20మందికి పైగా గాయపడ్డారు.