: జగన్ శేష జీవితం జైల్లోనే: మంత్రి అయ్యన్నపాత్రుడు
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన శేష జీవితాన్ని జైల్లోనే గడపనున్నారని ఏపీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. ఈ జన్మలో జగన్ ముఖ్యమంత్రి కాలేరని కూడా ఆయన తేల్చిచెప్పారు. నేటి ఉదయం మీడియాతో మాట్లాడిన అయ్యన్నపాత్రుడు, ఇటీవలి కాలంలో పలు సందర్భాల్లో జగన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. వైసీపీకి గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే సానుభూతి ఉందని అయ్యన్నపాత్రుడు అన్నారు. సదరు సానుభూతి నవ్యాంధ్ర రాజధానికి ఇబ్బందిగా పరిణమిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.