: ఛేదిస్తారా... చేతులెత్తేస్తారా?
సిడ్నీ టెస్టు ఆసక్తికరంగా మారింది. చివరి రోజు ఆటలో 349 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన భారత్ 68 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. విజయం సాధించాలంటే ఇంకా 22 ఓవర్లలో 146 పరుగులు చేయాలి. చేతిలో 6 వికెట్లున్నాయి. క్రీజులో రహానే (12 బ్యాటింగ్), సురేశ్ రైనా (0 బ్యాటింగ్) ఉండడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. కాగా, ఓపెనర్ విజయ్ (80), కెప్టెన్ కోహ్లీ (46) స్వల్ప వ్యవధిలో వెనుదిరిగారు.