: ఎంపీ పొంగులేటికి తెలంగాణ వైసీపీ బాధ్యతలు


తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అప్పగిస్తూ పార్టీ అధినేత వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలే వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులైన ఆయనను తాజాగా పూర్తి స్ధాయి అధ్యక్షుడిగా నియమించడం విశేషం. మరో 47 మందితో రాష్ట్ర, అనుబంధ సంఘాల కమిటీలను జగన్ ప్రకటించారు. కాగా, తెలంగాణ రాష్ట్ర కమిటీలో ఖమ్మం జిల్లాకు ప్రాధాన్యం లభించింది. ప్రధాన కార్యదర్శులుగా పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, పార్టీ సత్తుపల్లి నియోజకవర్గ ఇన్ చార్జ్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ నియమితులయ్యారు. తెలంగాణ రాష్ట్ర బాధ్యతలు అప్పగించడంతో పార్టీ శ్రేణులు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News