: నేడు, రేపు కూడా వరంగల్ లోనే కేసీఆర్... మురికివాడల్లో పర్యటన!
తెలంగాణ సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటన ఇప్పటికే రెండు రోజులు పూర్తైంది. నేడు, రేపు కూడా ఆయన అక్కడే ఉండనున్నారు. ఈ మేరకు నిన్ననే కేసీఆర్ విస్పష్ట ప్రకటన చేశారు. సమస్యలను పరిష్కరించిన తర్వాతే వరంగల్ నుంచి బయలుదేరతానని ప్రకటించిన ఆయన, ఆ మేరకు నిన్న హన్మకొండలోని మురికివాడల్లో పర్యటించారు. పలు ప్రాంతాల్లో చేపట్టాల్సిన, చేపట్టనున్న పనులకు సంబంధించి అక్కడికక్కడే అధికారులకు దిశానిర్దేశం చేశారు. నేడు ఎనుమాముల మార్కెట్ యార్డుతో పాటు పలు మురికివాడల్లో ఆయన పర్యటించనున్నారు. కేసీఆర్ సుదీర్ఘ పర్యటన వరంగల్ వాసుల్లో ఆనందం నింపుతున్నా, అధికారులు మాత్రం ఉరుకులు పరుగులు పెట్టాల్సి వస్తోంది.