: రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా... క్రీజులోకొచ్చిన కెప్టెన్ కోహ్లీ!


ఆఖరి టెస్టు చివరి రోజు ఆటలో స్వల్ప వ్యవధిలోనే భారత్ రెండో వికెట్ ను కోల్పోయింది. జట్టు స్కోరు సెంచరీ మార్కు దాటిన కాసేపటికే స్టైలిష్ బ్యాట్స్ మన్ రోహిత్ శర్మ (39) షేన్ వాట్సన్ బౌలింగ్ లో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ చేతికి దొరికిపోయాడు. రోహిత్ వెనుదిరగడంతో క్రీజులోకొచ్చిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ (12 బ్యాటింగ్) ధాటిగా ఆడేందుకు ప్రయత్నిస్తున్నాడు. 46 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. ఓపెనర్ మురళీ విజయ్ (47) హాఫ్ సెంచరీకి చేరువయ్యాడు.

  • Loading...

More Telugu News