: నిలకడగా టీమిండియా బ్యాటింగ్...సెంచరీ దాటిన స్కోరు!


నాలుగో టెస్టులో లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియా నిలకడగా బ్యాటింగ్ చేస్తోంది. 349 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా ఆదిలోనే లోకేశ్ రాహుల్(16) రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. దీంతో క్రీజులోకి వచ్చిన రోహిత్ శర్మ (39), మురళీ విజయ్ (46)తో కలిసి నిలకడగా స్కోరు బోర్డును కదిలిస్తున్నాడు. 37 ఓవర్లు ముగిసేసరికి 100 మార్కు దాటిన టీమిండియా స్కోరు నెమ్మదిగా కదులుతోంది. ఒక్క రోజులో 349 పరుగుల లక్ష్య సాధన కష్టమన్న భావనతో టీమిండియా చివరి టెస్టును డ్రా చేసుకునేందుకే ప్రాధాన్యమిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో నింపాదిగా బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా బ్యాట్స్ మెన్, పరుగులు రాబట్టేకంటే వికెట్లు కాపాడుకునేందుకే ప్రాధాన్యమిస్తున్నారు.

  • Loading...

More Telugu News