: సంగీత దర్శకుడు చక్రి భార్యకు అత్తింటి వేధింపులు... జూబ్లీ హిల్స్ పీఎస్ లో ఫిర్యాదు


ఇటీవలే అకాల మరణం చెందిన ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి భార్యకు అత్తింటి వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. అత్త, ఆడపడుచులు తనను మానసికంగానే కాక శారీరకంగానూ వేధింపులకు గురి చేస్తున్నారంటూ చక్రి భార్య శ్రావణి హైదరాబాదు, జూబ్లీ హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రావణి ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు విద్యావతి, వాణిదేవి, మోహిత్, లక్ష్మణరావు, కృష్ణ ప్రియ, నాగేశ్వరరావు తదితరులపై ఐపీసీ 498, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. చక్రి మరణించిన నాలుగైదు రోజులకే అత్తింటి ఆరళ్లపై శ్రావణి నోరు విప్పిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News