: తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ చలి పులి... ఉత్తర దిశ చలిగాలులే కారణమట!


గత నెలలో తెలుగు రాష్ట్రాలను ఉక్కిరిబిక్కిరి చేసిన చలి పులి మళ్లీ తన ప్రతాపం చూపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ సహా తెలంగాణలోనూ క్రమంగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. విశాఖలోని మన్యంలో నెల వ్యవధిలోనే మరోమారు ఉష్ణోగ్రత 2 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఏజెన్సీలోని మోదమ్మకొండపాదాల వద్ద అత్యల్పంగా 1 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. రెండు రాష్ట్రాల్లో చలి పెరడగంతో ప్రజలు ఇళ్లు వదిలి బయటకు వచ్చేందుకు సాహసించడం లేదు. హైదరాబాదులో మరింతగా పడిపోయిన ఉష్ణోగ్రతల నేపథ్యంలో నగరవాసులు ఇళ్లకే పరిమితమయ్యారు. ఉత్తర దిశ నుంచి వీస్తున్న చలి గాలులే తెలుగు రాష్ట్రాల్లో చలి పులికి కారణమని వాతావరణ శాఖ వెల్లడించింది. చలి తీవ్రత మరికొన్ని రోజులు కొనసాగే అవకాశాలున్నాయని ఆ శాఖ తెలిపింది.

  • Loading...

More Telugu News