: ఎమ్మెల్యే గన్ మెన్ పై మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ దాడి
ఆదిలాబాద్ జిల్లాలో మధ్యాహ్నం జరిగిన కడెం రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించడానికి వెళ్లిన ఎమ్మెల్యే రేఖా నాయక్ గన్ మెన్ పై మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ దాడి చేసి వివాదం రేపారు. దీనిపై ఎమ్మెల్యే రేఖా నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ ను అరెస్ట్ చేయాలంటూ ఆమె రోడ్డుపై బైఠాయించారు. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.