: జబర్దస్త్ నటీ నటులు, యాంకర్, జడ్జ్ లపై కేసు నమోదు
ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ ప్రోగ్రాంలో పలువురు నటీనటులు, యాంకర్, న్యాయ నిర్ణేతలపై కరీంనగర్ జిల్లా ఎల్ఎండీ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఈటీవీలో అక్టోబర్ 30 రాత్రి 9.30 గంటలకు ప్రసారం చేసిన జబర్దస్త్ ప్రోగ్రాంలో బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారి మనోభావాలను దెబ్బతీశారని ఆరోపిస్తూ తిమ్మాపూర్ కు చెందిన కేతిరెడ్డి అంజిరెడ్డి కోర్టులో ఫిర్యాదు చేశాడు. దీనిపై స్పందించిన న్యాయస్థానం జబర్దస్త్ నటులు శేషు, సుధాకర్, యాంకర్ రష్మీ, న్యాయనిర్ణేతలు నాగేంద్రబాబు, రోజాలపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది.