: జోథ్ పూర్ కేంద్రీయ విశ్వవిద్యాలయ ఛైర్మన్ అరెస్టు
నకిలీ ధ్రువపత్రాల కుంభకోణంలో జోథ్ పూర్ కేంద్రీయ విశ్వవిద్యాలయ ఛైర్మన్ మెహతా అరెస్టయ్యారు. ఎలాంటి పరీక్షలు రాయకుండానే విద్యార్థులకు నకిలీ పట్టాలు మంజూరు చేశారనే ఆరోపణపై రాజస్థాన్ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. 10 వేల రూపాయల నుంచి 15 రూపాయలు వరకు లంచం తీసుకుని ఆయన నకిలీ పట్టాలు మంజూరు చేశారని పోలీసులు తెలిపారు. అరెస్టు చేస్తున్న సమయంలో కూడా ఆయన నుంచి పోలీసులు కొన్ని దస్త్రాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.