: సునంద హత్య వివరాలు చేతికి రాగానే పిలుస్తా: ఢిల్లీ పోలీస్ కమిషనర్
కేంద్ర మాజీ మంత్రి శశిధరూర్ భార్య సునంద పుష్కర్ హత్య కేసులో తొందర్లోనే స్పష్టత వస్తుందని ఢిల్లీ కమిషనర్ బస్సీ తెలిపారు. ఆమె హత్య కేసు దర్యాప్తు నిమిత్తం సిట్ ను ఏర్పాటు చేశామని అన్నారు. కేసుకు సంబంధించిన వివరాలపై మూడు లేక నాలుగు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఆయన చెప్పారు. పూర్తి వివరాలు తనకు అందగానే మీడియా సమావేశం నిర్వహించి వెల్లడిస్తానని ఆయన తెలిపారు. సమగ్ర దర్యాప్తు జరగకుండా తాను ఏదీ చెప్పలేనని ఆయన సూచించారు.