: అతడిని తీసేసి ఇతనికి అవకాశమా?: మురళీధరన్
శ్రీలంక వరల్డ్ కప్ జట్టు కూర్పుపై దిగ్గజ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ స్పందించాడు. ఓపెనర్ ఉపుల్ తరంగకు మొండి చెయ్యి చూపడంపై ముత్తయ్య ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. వన్డేల్లో మంచి రికార్డున్న ఉపుల్ తరంగను పక్కన పెట్టి ఆల్ రౌండర్ జీవన్ మెండిస్ ను ఎంచుకోవడం తనకు అర్థం కాలేదని అన్నాడు. ఉపుల్ తరంగ అనుభవం జట్టుకు చాలా ఉపయోగపడేదని ఆయన పేర్కొన్నాడు. కాగా, వరల్డ్ కప్ జట్ల కూర్పుపై పలు దేశాల వెటరన్ క్రికెటర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.