: సునంద కేసులో న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా: శశి థరూర్
తన భార్య సునంద పుష్కర్ హత్య కేసులో తనకు, ఆమె కుటుంబానికి న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ అన్నారు. రాజకీయ ఒత్తిడి లేకుండా కేసు దర్యాప్తు పారదర్శకంగా జరపాలన్నారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిని కోరానని చెప్పారు. సునంద కేసుపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోందని, దర్యాప్తులో పోలీసులకు పూర్తిగా సహకరిస్తానని థరూర్ తెలిపారు. కేసు సాధ్యమైనంత త్వరగా కొలిక్కి రావాలని కోరుకుంటున్నానన్నారు. ఈ వ్యవహారంలో తాను ఏడాది నుంచి మౌనంగానే ఉన్నానని, ఊహాజనిత, నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని కోరారు.