: పెనుకొండ బస్సు ఘటనను సుమోటోగా స్వీకరించిన జిల్లా కోర్టు


అనంతపురం జిల్లా పెనుకొండ రహదారి వద్ద చోటుచేసుకున్న ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటనను జిల్లా కోర్టు సుమోటోగా స్వీకరించింది. దీనిపై పోలీసు, రవాణా, ఆర్ అండ్ బీ, ఆర్టీసీ అధికారులు, కాంట్రాక్టర్లు, సబ్ కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 24న విచారణకు హాజరుకావాలని వారందరినీ ఆదేశించింది. ప్రమాదం జరిగిన మార్గంలో ఇప్పటికీ వాహనాలకు అనుమతివ్వడంపై న్యాయస్థానం మండిపడింది. ఇప్పటికీ రక్షణ చర్యలు తీసుకోకపోవడాన్ని న్యాయమూర్తి తప్పుబట్టారు. రెండు రోజుల కిందట (బుధవారం) జరిగిన ఈ ఘటనలో 15 మంది చనిపోగా, 20 మందికి పైగా గాయాలైన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News