: సినిమాల్లో నటించేంత సమయం లేదు: నటి శిల్పాశెట్టి


వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను వివాహం చేసుకుని, తరువాత ఓ బిడ్డకు జన్మనిచ్చిన పొడుగుకాళ్ల సుందరి శిల్పాశెట్టి మళ్లీ నటనవైపు చూడలేదు. పూర్తిగా కొడుకు వియాన్ కోసమే సమయాన్ని కేటాయించింది. అయితే, మళ్లీ సినిమాల్లో నటిస్తారా? అని అడిగితే అంత సమయం లేదంటోంది. "వియాన్ చాలా చిన్నవాడు కాబట్టి ప్రస్తుతానికి నేను ఏ ఒక్క చిత్రం చేయడంలేదు. నా మాతృత్వాన్ని పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నా. నా మొత్తం సమయాన్ని మా అబ్బాయికే కేటాయించాలనుకుంటున్నా" అని శిల్ప తెలిపింది. ఇదిలా ఉంటే 'న్యూట్రిషన్ అండ్ హెల్త్' అనే పుస్తకం రాసే పనిలోనూ శిల్ప బిజీగా ఉందట.

  • Loading...

More Telugu News