: పారిస్ లో మళ్లీ కాల్పులు... కొందరిని బందీలుగా పట్టుకున్న ఉగ్రవాదులు!
ఫ్రాన్స్ రాజధాని పారిస్ మరోసారి ఉలిక్కిపడింది. వరుసగా మూడోరోజూ కాల్పులు చోటుచేసుకున్నాయి. పారిస్ సమీపంలోని డమార్టన్ ఎన్ గోయిల్ వద్ద పోలీసులు ఓ కారును వెంబడిస్తుండగా, అందులోని వ్యక్తులు కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. దుండగులు సెన్ ఏ మార్నే ప్రాంతంలో కొందరిని బందీలుగా పట్టుకున్నట్టు సమాచారం. ఘటనపై ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. పారిస్ లోని చార్లీ హెబ్డో పత్రిక కార్యాలయంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపి 12 మందిని పొట్టనబెట్టుకోవడం తెలిసిందే. అనంతరం, మరో ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో ఓ మహిళా పోలీసు అధికారి మరణించారు.