: కర్ణాటకలోనూ కాలిడనున్న మజ్లిస్... బెంగళూరు మునిసిపల్ ఎన్నికల్లో పోటీ?
హైదరాబాదులో మంచి పట్టున్న మజ్లిస్ ఇటీవల మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తొలి యత్నంలోనే సత్తా చాటింది. తాజాగా కర్ణాటకలోనూ కాలుమోపేందుకు సన్నాహాలు చేస్తోంది. ఏప్రిల్ నెలలో జరిగే బృహత్ బెంగళూరు మహానగర పాలికే (బీబీఎంపీ) ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆ పార్టీ సన్నాహాలు చేస్తోంది. బెంగళూరు మునిసిపల్ ఎన్నికల బరిలో దిగేందుకు తమ పార్టీ కార్యకర్తలకు అనుమతిచ్చామని ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ నిన్న మీడియాతో చెప్పారు. ఏ ఒక్కరితోనూ పొత్తు పెట్టుకోబోమని ప్రకటించారు. పార్టీ వర్గాల సమాచారం మేరకు బెంగళూరు నగర పాలక సంస్థ (మొత్తం 198 వార్డులు) ఎన్నికల్లో పది స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపనున్నట్లు తెలుస్తోంది.