: పారిస్ దాడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీఎస్పీ నేతపై కేసు
ఫ్రాన్స్ లోని పారిస్ లో 'చార్లీ హెబ్డో' పత్రిక కార్యాలయంపై ఉగ్రవాదుల దాడిని సమర్థిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఉత్తరప్రదేశ్ బీఎస్పీ నేత, మాజీ ఎంపీ యాకుబ్ ఖురేషీపై పోలీసులు కేసు నమోదు చేశారు. కొట్వాలీ పోలీస్ స్టేషన్ లో గత రాత్రి కేసు నమోదు చేసినట్టు ఎస్పీ ఓం ప్రకాశ్ వెల్లడించారు. మహమ్మద్ ప్రవక్తను కించపరిస్తే మరణం కొని తెచ్చుకోవాల్సి వస్తుందని ఖురేషీ మీరట్ లో అన్నారు. అంతేగాక, ఈ ఘటనలో దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదని, ముందు చెప్పిన విధంగా వారికి రూ.51 కోట్ల నగదు బహుమతి ఇస్తాననని ప్రకటించిన సంగతి తెలిసిందే. చార్లీ హెబ్డో పత్రిక ఇస్లాం వ్యతిరేక కార్లూన్లను ప్రచురించడంపై అప్పట్లో తీవ్రంగా మండిపడిన ఆయన, ఆ కార్టూనిస్టులను చంపినవారికి రూ.51 కోట్లు రివార్డుగా ఇస్తానని 2006లో ప్రకటించారు. తాజాగా, ఆ పత్రిక కార్యాలయంపై దాడులు జరగడంతో, దాడికి పాల్పడిన ఉగ్రవాదులకు ఆ రివార్డు అందజేసేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.