: ఢిల్లీలో జోరందుకున్న ఎన్నికల ప్రచారం... రేపు రామ్ లీలా మైదాన్ లో మోదీ సభ
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మరింత ఊపందుకోనుంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల సంఘం నేడు ప్రకటించే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో త్రిముఖ పోరు నెలకొన్న ఢిల్లీలో ఎన్నికల నినాదాలు హోరెత్తనున్నాయి. ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ అందరికంటే ముందే ప్రచారాన్ని ప్రారంభించగా, బీజేపీ కూడా ఢిల్లీ వ్యాప్తంగా చిన్న చిన్న సభలు, సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ నెల 10న ప్రధాని నరేంద్ర మోదీ నగరంలోని రామ్ లీలా మైదాన్ లో ఎన్నికల సభలో పాల్గొంటారు. ప్రధాని సభ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరవుతారని భావిస్తున్న పార్టీ నేతలు అందుకనుగుణంగా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక, ప్రచారంలో కాస్త వెనుకబడ్డ కాంగ్రెస్ నేడో, రేపో తన ప్రచారాన్ని మొదలుపెట్టనుంది.