: ఏపీకి ప్రత్యేక హోదా అంశం పరిశీలనలో ఉంది: అమిత్ షా


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశం పరిశీలనలో ఉందని, దీనిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలిపారు. రాష్ట్రానికి కేంద్రం అన్ని విధాలా సాయం చేస్తుందని అన్నారు. ఏపీ బీజేపీ పదాధికారులతో విజయవాడలో సమావేశం ముగిసిన అనంతరం షా మీడియాతో మాట్లాడారు. ఏపీలో 10 లక్షల సభ్యత్వాల నమోదును లక్ష్యంగా నిర్దేశించామన్నారు. తమ విధానాలు నచ్చి పార్టీలో చేరేవారికి ఆహ్వానం పలుకుతున్నామన్నారు. అన్ని రాష్ట్రాల్లో బీజేపీని విస్తరించడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ద్రవ్యోల్బణం సున్నా శాతానికి రావడం మోదీ ప్రభుత్వం ఘనతేనని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News