: 'బుధవారం మధ్యాహ్నం' అంటేనే వణుకుతున్న బెంగళూరు!
బుధవారం వచ్చిందంటే బెంగళూరు నగరవాసులు వణికిపోతున్నారు. అందునా మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య బయటకు రావడానికి జంకుతున్నారు. కారణం ఏంటంటే... ఆ సమయంలోనే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయట. గత సంవత్సరం మొత్తం 5004 రోడ్డు ప్రమాదాలు జరగగా అందులో ఒక్క బుధవారమే 803 ప్రమాదాలు జరిగినట్టు గణాంకాలు వెల్లడించాయి. బుధవారం తరువాత స్థానంలో శనివారం ఉందట. 773 రోడ్డు ప్రమాదాలు శనివారం జరిగాయి. మృతుల్లో అత్యధికులు ద్విచక్ర వాహనదారులు, పాదచారులేనని తెలుస్తోంది.