: ఆ మరుగుజ్జులు మొదటితరం పూర్వీకులు!
మానవ పరిణామ క్రమంలో ఇప్పటికీ.. ముందు తరాలకు ప్రస్తుత తరాలకు ఆకృతి, పరిమాణంలో మనచుట్టూతానే బోలెడు వ్యత్యాసాలు కనిపిస్తూ ఉంటాయి. కానీ, ఇండోనేషియాలోని ఒక ద్వీపంలో 12 వేల ఏళ్లుగా మరుగుజ్జు రూపంలోనే ఉన్న మానవ జాతి ఉంది. వారి ఆకృతిలో ఇవాళ్టి వరకు ఎలాంటి మార్పుచేర్పులు చోటు చేసుకోలేదు. ఆ ద్వీపం అంతా మరుగుజ్జులే. చిన్న తల.. మూడడుగులు మించని దేహంతో ఉంటారు. సైన్సులో వీరిని హోమో ఫోరెసెన్సిక్ జాతిగా వ్యవహరిస్తారు. ఈ తెగమీద ఇప్పటికే అసంఖ్యాకమైన పరిశోధనలు జరిగాయి.
అయితే టోక్యోలోని నేషనల్ మ్యూజియం ఆఫ్ నేచర్ అండ్ సైన్స్ వారు సుదీర్ఘ పరిశోధనలు, మెదడు స్కానింగ్‌లు అనేకం జరిపి.. వీరు తొలితరం మనుషులని నిర్ణయించారు. ప్రపంచంలో కొన్ని జాతుల్లో కాలంతో పాటు ఆకృతిలో మార్పులు రాకపోవడం సహజమేనని శాస్త్రవేత్తలు అంటున్నారు. జీవన పరిస్థితుల కారణంగానే వీరు ఇప్పటికీ మరుగుజ్జులుగానే ఉంటున్నారని తేల్చారు. అయితే ఈ జాతి ఎలా ఆవిర్భవించిందనే విషయంలో మాత్రం రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి.