: సూళ్లూరుపేటలో ఫ్లెమింగో ఫెస్టివల్ ప్రారంభం
నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలోని పులికాట్ సరస్సు వద్ద ఫ్లెమింగో ఫెస్టివల్ ప్రారంభమైంది. మంత్రులు నారాయణ, పీతల సుజాత కలసి ఈ ఫెస్టివల్ ను ప్రారంభించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన వివిధ రకాల స్టాల్స్ ను కూడా మంత్రులు ప్రారంభించారు. మూడు రోజుల పాటు ఈ పండుగ జరగనుంది. వలస పక్షులను వీక్షించేందుకు విదేశీయులతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి పర్యాటకులు కూడా హాజరయ్యారు.