: మరో రెండు రోజులు వరంగల్ లోనే ఉంటా... కార్డులు, పెన్షన్లు అందజేసే వెళతా: కేసీఆర్


రేషన్ కార్డులు, పింఛన్ల పంపిణీపై రాష్ట్రవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న విమర్శలకు చెక్ పెట్టేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ రంగంలోకి దిగినట్టున్నారు. నిన్న వరంగల్ జిల్లా పర్యటనకు వెళ్లిన ఆయన, మరో రెండు రోజుల పాటు ఇక్కడే ఉంటానని వరంగల్ ప్రజలకు ఆయన కొద్దిసేపటి క్రితం హామీ ఇచ్చారు. రేషన్ కార్డులు, పింఛన్లను అందజేసిన తర్వాతే ఇక్కడి నుంచి బయలుదేరతానని ప్రకటించిన ఆయన అధికారులను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. వరంగల్ లో కేసీఆర్ పర్యటన సందర్భంగా పింఛన్ల కోసం పెద్ద సంఖ్యలో బాధితులు ఆయనకు ఫిర్యాదు చేశారు. దీంతో కంగుతిన్న కేసీఆర్... ఇకపై పింఛన్లు, రేషన్ కార్డుల జారీలో జాప్యాన్ని, అక్రమాలను ఎంతమాత్రం సహించేది లేదని తేల్చిచెప్పారు. అంతేగాక, కార్డులు, పింఛన్ల పంపిణీని పూర్తి చేసి కానీ వరంగల్ నుంచి కదలనని ఆయన ప్రకటించారు.

  • Loading...

More Telugu News