: హైదరాబాదులో మరో కారు బీభత్సం... చైతన్యపురిలో పాదచారులపైకి దూసుకెళ్లిన డ్రైవింగ్ స్కూల్ కారు
హైదరాబాదులో అదుపు తప్పుతున్న కార్లు పెను నష్టాన్నే మిగులుస్తున్నాయి. నేటి ఉదయం మహేశ్వరం మండలం నాగారం పరిధిలో వాకర్స్ పైకి దూసుకెళ్లిన ఓ కారు... ఉజ్వల భవిష్యత్తు ఉన్న ముగ్గురు యువకుల ప్రాణాలను హరించగా, కొద్దిసేపటి క్రితం దిల్ సుఖ్ నగర్ సమీపంలోని చైతన్యపురిలో మరో కారు పాదచారులపైకి దూసుకెళ్లింది. డ్రైవింగ్ పాఠాలు నేర్పేందుకు డీసెంట్ డ్రైవింగ్ స్కూల్ వినియోగిస్తున్న కారు అదుపు కోల్పోయి ఇద్దరు పాదచారులను తీవ్రంగా గాయపరచింది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.