: కోహ్లీ కెప్టెన్సీలో పసలేదంటున్న ఆసీస్ దిగ్గజాలు


తొలిసారి పూర్తిస్థాయి టెస్టు కెప్టెన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న విరాట్ కోహ్లీపై ఆస్ట్రేలియా దిగ్గజాలు విమర్శలు చేశారు. సిడ్నీ టెస్టులో కోహ్లీ అనుసరిస్తున్న వ్యూహాలు గందరగోళంగా ఉన్నాయని ఇయాన్ చాపెల్, మైకేల్ క్లార్క్ అభిప్రాయపడ్డారు. కోహ్లీ పదేపదే బౌలర్లను మార్చడం, ఫీల్డింగ్ లో తరచూ మార్పులు చేస్తున్నాడని, అది బౌలర్లకు తప్పుడు సందేశాన్ని పంపిందని చాపెల్ పేర్కొన్నాడు. తద్వారా వారి లయ దెబ్బతిన్నదని విశ్లేషించాడు. ఇక, క్లార్క్ స్పందిస్తూ, ఫార్మాట్ కు తగినవిధంగా బౌలింగ్, ఫీల్డింగ్ మార్పులు చేయడాన్ని కోహ్లీ నేర్చుకోవాలని సలహా ఇచ్చాడు. బౌలర్లను వెంటవెంటనే మార్చడం టి20 క్రికెట్ కు సరిపోతుందని, టెస్టుల్లో అలాంటి ఎత్తుగడలు పనిచేయవని అన్నాడు.

  • Loading...

More Telugu News