: ఆకతాయిల వేధింపులతో గృహిణి ఆత్మహత్య... పోలీసుల అదుపులో నిందితులు


నిర్భయ చట్టం చట్టుబండలవుతోంది! మహిళలపై వేధింపులకు దిగేవారిపై కొరఢా ఝుళిపిస్తుందనుకున్న ఈ చట్టం అంటే ఆకతాయిలకు భయం లేకుండాపోతోంది. రంగారెడ్డి జిల్లా ఘట్ కేసర్ మండలం అన్నోజిగూడలో నేటి ఉదయం దారుణం చోటుచేసుకుంది. ఆకతాయి వేధింపుల నేపథ్యంలో ఓ గృహిణి బలవన్మరణం చెందింది. భర్త నిర్వహిస్తున్న చెప్పుల షాప్ లోనే ఆకతాయిల వేధింపులకు గురైన ఆ గృహిణి, ఇంటికొచ్చి ఉరేసుకుని తనువు చాలించింది. విషయం తెలుసుకున్న భర్త, ఆకతాయిలపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు గృహిణి ఆత్మహత్యకు కారకులైన ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News