: మెదక్ జిల్లాలో స్కూల్ బస్సు కింద పడి రెండేళ్ల బాలుడు మృతి


మెదక్ జిల్లాలో స్కూలు బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా రెండేళ్ల బాలుడు మృత్యువాతపడ్డాడు. కౌడిపల్లి మండలం నాగ్ సాన్ పల్లిలో నేటి ఉదయం చోటుచేసుకున్న ఈ ఘటనలో రెండేళ్ల వయసున్న చిన్నారి బాలుడు బస్సు చక్రాల కింద నలిగిపోయాడు. విద్యార్థులను స్కూలుకు తీసుకెళ్లేందుకు గ్రామానికి వచ్చిన డాన్ బాస్కో పాఠశాలకు చెందిన బస్సును డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపడం వల్లనే బాలుడు చనిపోయాడని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. స్కూలు బస్సు కింద పడి బాలుడు చనిపోవడంతో గ్రామంలో విషాదం నెలకొంది.

  • Loading...

More Telugu News