: మూడు వేల మందికి ఐ ఫోన్-సిక్స్ఎస్ లను బహుమతిగా ఇచ్చిన ఇన్ఫోసిస్
ఉద్యోగాలను వీడిపోతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో వినూత్న రీతిలో నష్టనివారణ చర్యలు చేపట్టింది ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్. సంస్థ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 3 వేల ఐ ఫోన్-6 ఎస్ లను ఉద్యోగులకు బహుమతిగా అందించింది. సంతృప్తికర పనితీరు కనబరిచిన టాప్-3000 ఉద్యోగులకు గిఫ్టులు ఇవ్వాలని నిర్ణయించినట్టు ఇన్ఫోసిస్ సీఈఓ విశాల్ సిక్కా తెలిపారు. బహుమతితో పాటు వారి సేవలను గుర్తించినట్టు ఒక ఇ-మెయిల్ ను కూడా ఆయన పంపారు. దీన్ని 'హాలిడే బోనస్'గా ఆయన అభివర్ణించారు.